బీహార్(Bihar) ఎన్నికల ప్రచారంలో ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh).. చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే పాట్నాలో ఆయన ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు లోకేష్. ఈ సందర్భంగానే ఆయన భారతదేశ అభివృద్ధి, ఏపీ అభివృద్ధిపై ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది.
దేశప్రజలు ప్రధానిగా సరైన సమయంలో సరైన నేతను ఎన్నుకున్నారు. దీంతో గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా బీహార్ కూడా నితీష్ కుమార్(Nitish Kumar) కు ముందు, తర్వాత అన్నవిధంగా అభివృద్ధి సాధించింది. సమర్థవంతమైన నాయకుడి వల్లే బీహార్ అభివృద్ధి సాధిస్తోంది. ఏపీలో డబుల్ ఇంజన్ బులెట్ సర్కారు కారణంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వాల కొనసాగింపు అవసరాన్ని ఈ సందర్భంగా వివరించాను’’ అని లోకేష్(Nara Lokesh) చెప్పారు.
Read Also: ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు : చంద్రబాబు
Follow Us on : Pinterest

