కలం, వెబ్ డెస్క్: నాంపల్లి(Nampally)లోని బట్చాస్ ఫర్నీచర్(Butchas Furniture) భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదైంది. బట్చాస్ ఫర్నీచర్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ 18 గంటలుగా కొనసాగుతోంది. మంటల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. పలువురు రాజకీయ నేతలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. దట్టమైన పొగతో భవనం లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకుండాపోయింది. జేసీబీ సహాయంతో రెస్క్యూ టీం గ్రౌండ్ నుంచి సెల్లార్కు డ్రిల్లింగ్ చేస్తున్నారు. మంటల్లో ఐదుగురు చిక్కుకున్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారి కుటుంబసభ్యులు శనివారం మధ్యాహ్నం నుంచి అక్కడే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


