కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్(Jogi Ramesh) ర్యాలీపై విజయవాడ(Vijayawada)లో కేసు నమోదైంది. ఇటీవల జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జైలు నుంచి ఇబ్రహీంపట్నం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి తీసుకోలేదని, ర్యాలీలో డీజే వినియోగించారని కానిస్టేబుల్ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జోగి రమేష్ బంధువులు స్వామి, నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


