కలం, వెబ్ డెస్క్ : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)కు ముందు తాను రాసిన ఆర్టికల్ చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పైనే తనకు కాంగ్రెస్ పార్టీతో బేదాభిప్రాయాలను ఉన్నాయని చెప్పారు. పార్లమెంట్లో తాను ఎప్పుడూ పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ ను ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపీలు, కేంద్ర మంత్రులతో కూడిన దౌత్య బృందాలను విదేశాలకు పంపిన విషయం తెలిసిందే. ఈ బృందంలో ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో అప్పటి పరిస్థితులపై థరూర్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యవహార శైలిని సమర్థించుకుంటూ మనకు ఎప్పుడు మన దేశమే ప్రాధాన్యంగా ఉండాలని చెప్పారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ కు ముందు తాను రాసిన ఆర్టికల్ గురించి ప్రస్తావించారు. పహల్గామ్ దాడికి సంబంధించి ఆర్టికల్ రాశానని చెప్పారు. అందులో ఉగ్రదాడులకు సరైన సైనిక ప్రతిస్పందన ఉండాలని రాసినట్లు తెలిపారు. పాకిస్తాన్ భారత్ పై దీర్ఘకాలిక ఘర్షణలకు వెళ్లకుండా ఉగ్రశిబిరాలను లక్ష్యంగా పెట్టుకోవాలని అందులో సూచించినట్లు స్పష్టం చేశారు. అయితే, ఆర్టికల్ లో తాను చెప్పినట్లుగానే కేంద్రం ప్రభుత్వం ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడం ఆశ్చర్యం కలిగించిందని శశిథరూర్ వెల్లడించారు. కాగా, గతకొన్ని రోజులుగా శశిథరూర్ కి కాంగ్రెస్ పార్టీకి మధ్య అంతర్గత విభేదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని పొగడడం కూడా ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత మొదలయింది. ఈ తరుణంలో మరోసారి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు.
Read Also: ఐఏఎస్, ఐపీఎస్ కేటగిరీపై కొత్త పాలసీ
Follow Us On: X(Twitter)


