కలం, వెబ్ డెస్క్: స్టార్టప్‌లకు, ఇన్నోవేషన్లకు చిరునామాగా మారి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ టీ హబ్‌లో ప్రభుత్వ ఆఫీసులు పెడతారన్న వార్తలు ఇటీవల ఊపందుకున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. టీ హబ్‌ను (T Hub) స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఈ విషయంపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు.
అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదన్నారు. స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేసిన టీ హబ్‌లో ప్రభుత్వ ఆఫీసులకు చోటు లేదని స్పష్టం చేశారు. అధికారులు ఇలాంటి ఆలోచనలు ఉంటే మానుకోవాలని సీఎం రేవంత్ (Revanth Reddy) హెచ్చరించారు.
Read Also: బెడిసికొట్టిన రాజగోపాల్‌రెడ్డి ప్లాన్..!
Follow Us On : WhatsApp


