epaper
Tuesday, November 18, 2025
epaper

ఆస్కార్ అవార్డులపై పరేశ్ రావల్ సంచలన వ్యాఖ్యలు

ఆస్కార్ అవార్డులపై పరేశ్ రావల్(Paresh Rawal) సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డులు, బిరుదులు సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించినప్పటికీ, నటీనటులకు నిజమైన సంతృప్తి దర్శకులు, నిర్మాతల నుండి వచ్చే ప్రశంసలలోనే ఉంటుందని పరేశ్‌ రావల్‌ అభిప్రాయపడ్డారు. సినీ అవార్డుల వ్యవస్థ, జ్యూరీ ఎంపిక విధానం, లాబీయింగ్‌ వంటి అంశాలపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. “నాకు అవార్డుల గురించి అంతగా అవగాహన లేదు. కానీ, నేషనల్‌ అవార్డుల విషయంలో కూడా కొంత వరకు లాబీయింగ్‌ జరుగుతుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన ప్రయత్నాలు ఉంటాయి. సినిమా బృందం తమ చిత్రాన్ని జ్యూరీ(Jury) దృష్టికి తీసుకెళ్లడానికి నెట్‌వర్కింగ్‌, కొన్ని పార్టీలు, ఈవెంట్లు వంటివాటిని ఉపయోగిస్తారు. ‘ఇది ఫలానా దర్శకుడి సినిమా’ అని గుర్తించి కొన్ని సందర్భాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు,” అని ఆయన తెలిపారు.

“నాకు అవార్డుల కంటే దర్శకుల, నిర్మాతల ప్రశంసలే నిజమైన పురస్కారం. ‘నీ నటన అద్భుతంగా ఉంది’, ‘సీన్‌లో నువ్వు ప్రాణం పోశావు’ అని ఎవరో చెప్పినప్పుడు కలిగే ఆనందం ఏ అవార్డు ఇచ్చినా దానితో పోల్చలేం. ట్రోఫీలు, బిరుదులు కేవలం గుర్తింపుగా నిలుస్తాయి కానీ, ప్రశంసలు మన కళను కొనసాగించడానికి ప్రేరణగా ఉంటాయి.”

పరేశ్‌ రావల్‌(Paresh Rawal) ఇంకా అన్నారు. ఇది కేవలం భారతీయ సినీ రంగానికే పరిమితం కాదు. ఆస్కార్‌ వంటి అంతర్జాతీయ అవార్డుల ప్రక్రియల్లోనూ కొంతమేర లాబీయింగ్‌ ఉంటూనే ఉంటుంది. జ్యూరీ సభ్యులను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఆ వ్యవస్థ కూడా పూర్తిగా పరిశుభ్రమని చెప్పలేం, అని వ్యాఖ్యానించారు. గత నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న పరేశ్‌ రావల్‌ తన నటనతో అనేక పురస్కారాలు అందుకున్నారు. ‘వో ఛోకరీ’, ‘సర్‌’ సినిమాల్లో చేసిన అద్భుత నటనకుగాను ఆయనకు 1994లో జాతీయ ఉత్తమ సహాయనటుడి అవార్డు లభించింది. తన కెరీర్‌ గురించి మాట్లాడుతూనా ఆయన చెబుతున్నారు . “సినిమా అనేది ఒక సమిష్టి కృషి. ఒక మంచి దర్శకుడు, బలమైన కథ, అనుభూతి పంచే సన్నివేశం ఇవన్నీ కలిసినప్పుడే మంచి నటన వెలుస్తుంది. దర్శకుడు ‘బాగుంది’ అని చెప్పినప్పుడు అది నాకు ఏ అవార్డు కంటే పెద్ద ఆనందం,” అని అన్నారు.

Read Also: కర్ణాటక సీఎం మార్పు ఉందా? లేదా? సిద్దరామయ్య స్పందన ఇదే..

Follow Us On : Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>