నటుడు అల్లు శిరీష్(Allu Sirish) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. అల్లు ఫ్యామిలీలో పెళ్లి సందడి రానుందనే వార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇటీవలే ఆయన తన ప్రియురాలు నయనిక(Nayanika)తో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఈ నెల అక్టోబర్ 31నజరిగిన ఆ వేడుక ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, సాయి దుర్గాతేజ్, వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి తదితర హీరోలు హాజరై వేడుకను మరింత అందంగా మార్చారు.
ఈ నేపథ్యంలో శిరీష్(Allu Sirish) తాజాగా తన లవ్‌స్టోరీ ఎలా మొదలైందో అభిమానులతో పంచుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో ఆయన తన ప్రేమ కథను తీయగా గుర్తుచేసుకున్నారు. “వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సమయం (2023 అక్టోబర్)లో నితిన్, షాలిని వారు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. నేను ఆమెను మొదటిసారి అప్పుడే చూశా. ఆ క్షణం నుంచే మనసు ఆమెపై పడింది. ఆ తర్వాత మేము పరిచయం పెంచుకున్నాం, ప్రేమించుకున్నాం. చివరికి మా కుటుంబాల సమ్మతితో నిశ్చితార్థం చేసుకున్నాం,” అని తెలిపారు.
“ఒకరోజు మా పిల్లలు ‘నాన్నా.. అమ్మను ఎలా కలిశారు?’ అని అడిగితే ఇదే కథ చెబుతాను. నయనిక స్నేహితులు నన్ను తమ సర్కిల్‌లో చేర్చుకున్నందుకు వారికి థాంక్స్ చెబుతున్నా” అని అన్నారు. శిరీష్ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనిక వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా వివరాలు బయటకు రాలేకపోయినా, ఆమె సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన కుటుంబం నుండి వచ్చిందని తెలిసింది.
ఇక సినిమాల విషయానికొస్తే, అల్లు శిరీష్ గతంలో ఉర్వశివో రాక్షసివో’, అమెరికన్ బాయ్‌ఫ్రెండ్’, ‘గౌరవం’, ‘కొత్త జంట’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. వ్యక్తిగత జీవితంలో కొత్త దశను ప్రారంభిస్తున్న శిరీష్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.
Read Also: పార్కిన్ సన్స్‌ను ఎలా కంట్రోల్ చేయాలి?
Follow Us On : Instagram

