మొంథా ప్రభావిత ప్రాంతాలను ఏపీ ముఖ్యమంత్రి సహా మంత్రులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan).. గురువారం కృష్ణా జిల్లా కోడూరులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. రైతుల సమస్యలు, నష్టాలపై ప్రత్యక్షంగా వివరాలు తెలుసుకోనున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇవ్వనున్నారు. పర్యటన సందర్భంగా స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మొంథా తుఫాన్(Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రైతులు కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు. భారీ వర్షాలు, గాలివానలతో విస్తారంగా పంటలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో పొలాలు చెరువుల్లా మారిపోయాయి. ముఖ్యంగా అరటి, బొప్పాయి, వరి పంటలు భారీగా నష్టపోయాయి. సుమారు 2.5 లక్షల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అంచనా. వ్యవసాయ అధికారులు నష్టాల అంచనాకు దళాలను పంపి వివరాలు సేకరిస్తున్నారు.
Read Also: నారా లోకేష్ ఫొటోతో రూ.54.34 లక్షల స్కాం..

