కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే దివ్వెల మాధురి (Madhuri) సంక్రాంతి వేళ మరో వీడియో వదిలింది. తలపాగా చుట్టుకుని.. ఓ చేతిలో కోడిపుంజు, ఇంకో చేతిలో పెద్ద కత్తి పట్టుకుని తెగ హల్ చల్ చేస్తోంది. అలా అని కోళ్ల పందేలకు వెళ్తుందేమో అనుకోకండి. ఆమె ఇంటి వద్దే ఈ వీడియో చేసింది. కోడి పుంజును నిమురుతూ పందేలకు సై అన్నట్టు ఫోజులు ఇచ్చేసింది మాధురి (Madhuri). సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. ట్రెండ్ కు తగ్గట్టు వీడియోలు చేయడం మాధురికి అలవాటే కాబట్టి.. ఈ వీడియోతో మళ్లీ అటెన్షన్ లోకి వచ్చేసిందన్నమాట. ఈ వీడియో చూసిన కొందరు.. కొంపదీసి కోడిపుంజును ఏసేసిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో కోళ్ల పందేలకు ఏమైనా వస్తున్నావా అంటున్నారు. మొత్తానికి ఒక్క వీడియోతో మాధురి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.


