కలం, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా చిట్యాల (Chityal) ఎస్సై శ్రావణ్ కుమార్ (Shravan Kumar) పై చర్యలు తీసుకోవాలంటూ ఓ కుటుంబం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డ్ పట్టుకుని సాద రాములు కుటుంబం ఆందోళన వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన టూ వీలర్ వాహనం ఇవ్వకుండా ఎస్సై ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి ఎస్సై శ్రావణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


