కలం వెబ్ డెస్క్ : తమిళనాడులో పొంగల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే జల్లికట్టు(Jallikattu) క్రీడ గురువారం అవనియాపురంలో ఘనంగా ప్రారంభమైంది. మధురై, పాలమేడు, ఆలంగనల్లూరులో ఈ క్రీడ వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) శుక్రవారం ఉదయం మధురై(Madurai) జిల్లా పాలమేడులో జల్లికట్టు ప్రారంభించారు. స్థానికంగా అధికార యంత్రాంగం జల్లికట్టు నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు విజయ్(Vijay) పార్టీ టీవీకే(TVK Party)కు చెందిన జెండాలతో సందడి చేశారు. చేతిలో జెండాలు పట్టుకొని ప్రదర్శిస్తూ అరుస్తూ గోల చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


