Mobile Popup Ad
Mobile Popup Ad

శబరిమల తిరుగు ప్రయాణంలో విషాదం.. మంచిర్యాల దంపతులు మృతి

కలం, కరీంనగర్ బ్యూరో: శబరిమల యాత్రలో విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల (Mancherial) జిల్లా లక్షేటిపేట పేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ ( 63) అతని భార్య రమదేవి (59) దంపతులు అయ్యప్ప మాలలో ఓ ప్రైవేట్ సర్వీస్ బస్సులో శబరిమల (Sabarimala) దర్శనానికి వెళ్లారు. 15న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్ లో గురువారం సాయంత్రం అయ్యప్ప స్వాముల కోసం రెండు గంటల సేపు బస్సు నిలిపివేశారు. సముద్ర స్నానం, అక్కడున్న దేవాలయాలు సందర్శించారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొని దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. దంపతుల మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>