epaper
Friday, January 16, 2026
spot_img
epaper

తడబడినా బోణీ కొట్టిన యువ భారత్​

కలం, వెబ్​డెస్క్​: అండర్–19 వన్డే వరల్డ్​ కప్ (U19 World Cup)​ మొదటి మ్యాచ్​లో యువ భారత్ తడబడినా బోణీ కొట్టింది. జింబాబ్వేలోని బులవాయో వేదికగా గురువారం యూఎస్ఎతో జరిగిన మ్యాచ్​లో సూర్యవంశీ సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​లో ​ మొదట బ్యాటింగ్​ చేసిన అమెరికా జట్టు 35.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. నితీశ్ సుధిని(36; 52 బంతుల్లో 4 ఫోర్లు) టాప్​ స్కోరర్​. భారత బౌలర్లలో హెనిల్​ పటేల్​ 5 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. దీపేశ్​ దేవేంద్రన్​, ఆర్​ఎస్​ అంబరీష్​, ఖిలాన్​ పటేల్​, వైభవ్​ సూర్యవంశీ తలో వికెట్​ తీశారు.

ఛేదనలో వర్షం కారణంగా లక్ష్యాన్ని డీఎల్ఎస్​ పద్ధతిలో 37 ఓవర్లకు 96 పరుగులుగా నిర్ణయించారు. స్వల్ప లక్ష్యం చేరుకోవడంలో యువ భారత్​ తడబడింది. సూపర్​ ఫామ్​లోఉన్న చిచ్చర పిడుగు వైభవ్​ సూర్యవంశీ 2 పరుగులకే వెనుదిరిగాడు. వేదాంత్​ త్రివేది (2), కెప్టెన్​ ఆయుష్​ మాత్రె (19), విహాన్​ మల్హోత్రా(18) సైతం ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ఒక దశలో యువ భారత్​ 29/3తో నిలిచింది. అయితే, కనిష్క్​ చౌహాన్​(10నాటౌట్​) తోడుగా అభిజ్ఞాన్​ కుందు(42నాటౌట్​; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్​) జట్టును మరో 20 ఓవర్లు ఉండగానే గెలిపించాడు. ప్రత్యర్థి బౌలర్లలో రిత్విక్​ అప్పిడి 2 వికెట్లు, రిషబ్​  షంపి, ఉత్కర్ష్​ శ్రీవాత్సవ చెరో వికెట్​ తీశారు. హెనిల్ పటేల్​కు ‘ ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​’ దక్కింది.

U19 World Cup
U19 World Cup

Read Also: విద్యార్థుల ఆత్మహత్యలు.. విద్యాసంస్థలకు సుప్రీం కీలక ఆదేశం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>