కలం, వెబ్డెస్క్: విద్యార్థుల ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలపై ఉన్నత విద్యాసంస్థలకు సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్.. తమ పరిధిలోని ఏదైనా విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య (Student Suicides) కు పాల్పడిన లేదా అనుమానాస్పద స్థితిలో మరణించాడని తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించింది. అలాగే ఏటా ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య/అనుమానస్పద రీతిలో చనిపోతున్నారో తెలిపే వార్షిక నివేదికను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)తో పాటు, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ఇతర నియంత్రణ సంస్థలకు అందించాలని పేర్కొంది. రెసిడెన్షియల్ వసతి ఉన్న విద్యాసంస్థల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో స్పష్టం చేసింది.
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం కూడా విద్యాసంస్థల ప్రధానమైన బాధ్యత అని ధర్మాసనం (Supreme Court) గుర్తు చేసింది. తమ సంస్థలు పూర్తిగా సురక్షితం, సమానత్వం, సమగ్రతను ప్రోత్సహించేలా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదే అని స్పష్టం చేసింది. ఈ బాధ్యత నుంచి అవి తప్పించుకోలేవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. కాగా, దేశవ్యాప్తంగా కొన్నేళ్లుగా విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు ఎక్కువుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: జల్లికట్టు పోటీల్లో అపశృతి.. 10 మంది పరిస్థితి విషమం
Follow Us On: X(Twitter)


