బీఆర్ఎస్(BRS)కు తనకు ఎటువంటి సంబంధం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ పార్టీ గురించి తనను అడగొద్దని కూడా మీడియా వారికి సూచించారు. తన వెనక ఎవరూ లేరని, తన ముందు ప్రజలు మాత్రమే ఉన్నారని వ్యాఖ్యానించారు. కవిత చేపట్టిన ‘జనం బాట(Janam Bata) కార్యక్రమం ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో కొనసాగుతోంది. ఈ సందర్బంగానే ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అవమానాలు, అనుమానాలు అన్నీ ఉంటాయని అన్నారు.
‘‘నేను ఒక పని పెట్టుకుంటే ఆ కమిట్ మెంట్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. దగాపడ్డ ఉద్యమకారుల్లో నేను కూడా బాధితురాలినే. ఆడబిడ్డలు అని చెప్పరు. గతంలో కన్నా కూడా ఇప్పుడే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. బీఆర్ఎస్ తో నాకు సంబంధం లేదు. ఆ పార్టీ గురించి అడగకండి. నీళ్లు, నిధులు, నియామాకాల విషయంలో రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే మంచి పేరు వస్తుందని రేవంత్ కు సూచిస్తున్నా. జాగృతి ఒక సివిల్ సోసైటీ. ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యం. అందరికీ అవకాశం, అభివృద్ధి, ఆత్మగౌరవ ఉండాలన్నదే మా విధానం. సామాజిక తెలంగాణ ద్వారానే అది సాధ్యం. దాని కోసమే నా పోరాటం’’ అని Kavitha వ్యాఖ్యానించారు.
Read Also: తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్..!

