తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్(Gangula Kamalakar).. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక సందర్బంగా అమలులో ఉన్న ఎన్నికల కోడ్‌ను రేవంత్ ఉల్లంఘించారని, సినీ కార్మికులు నిర్వహించిన అభినందన సభలో ఆయన హామీలు ఇచ్చారని గంగుల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వకూడదని సీఎంకు తెలిసి కూడా కావాలనే ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు రేవంత్‌పై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy ఇచ్చిన హామీ ఇదే..
అభినందన సభలో పాల్గొన్న రేవంత్.. ‘‘కృష్ణా నగర్ లో ఒక మంచి స్థలాన్ని చూడండి. నర్సరీ నుంచి 12 గా తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీ ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తాం. సినీ కార్మికుల సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఫండ్ అందిస్తాం. సినిమా నుంచి వచ్చే ఆదాయంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి. భవిష్యత్ లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే… అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు అందిస్తేనే అనుమతి జీవో అందించేలా నిబంధనలు సడలిస్తాం’’ అని వెల్లడించారు.
Read Also: BRS తో నాకు సంబంధం లేదు: కవిత

