కలం, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టులో నేడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) లాయర్లు, ఈడీ తరఫున లాయర్లు తీవ్రంగా వాదోపవాదనలు చేసుకున్నారు. ఐ ప్యాక్ ఆఫీస్ మీద ఈడీ తనిఖీలను సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఈడీ (ED) అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. నేడు విచారణ జరిగింది. సీఎం మమత తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున సొలిసిటరీ తుషార్ మెహతా వాదించారు. తుషార్ మెహతా మాట్లాడుతూ.. ‘సీఎం మమతా బెనర్జీ ఐ ప్యాక్ ఆఫీస్ కు ఎందుకు వచ్చారు.. ఈడీ ఫైళ్లను ఎందుకు తీసుకెళ్లారు. బెంగాల్ పోలీసులు సీసీ పుటేజీని ధ్వంసం చేశారు. కోల్ కతా హైకోర్టులో వాదించకుండా మా లాయర్ ను అడ్డుకున్నారు. బస్సులు ఏర్పాటు చేసి హైకోర్టు వద్దకు జనాలను తరలించారు. హైకోర్టులో మా లాయర్ మైక్ ను కట్ చేయించారు‘ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
స్పందించిన సుప్రీంకోర్టు.. హైకోర్టును జంతర్ మంతర్ చేసేశారా.. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని కామెంట్ చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని.. అన్ని వివరాలను పరిశీలించాలని తెలిపింది. అటు మమతా బెనర్జీ (Mamata Banerjee) తరఫున అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘ఇన్ని రోజులు ఆగి ఇప్పుడే ఎందుకు తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల ముందు కావాలనే ఈడీ అధికారులు హడావిడి చేస్తున్నారు. మమతా బెనర్జీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికే ఇలా చేస్తున్నారు‘ అంటూ చెప్పుకొచ్చారు.
Read Also: మెడికల్ ఎమర్జెన్సీ.. భూమి పైకి వ్యోమగాములు
Follow Us On: X(Twitter)


