epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బుల్లెట్ దిగుద్ది, జర జాగ్రత్త.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: ఏ ముహుర్తాన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడో కానీ.. ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఎన్నికల హామీలో భాగంగా ‘అమెరికా ఫస్ట్’ అని ప్రకటించిన ట్రంప్‌ను సొంత దేశస్తులే వ్యతిరేకించారు. వీసాలు, సుంకాల పేరుతో ఇతర దేశాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వైఖరితో ట్రంప్‌‌కు కొత్త శత్రువులు ఏర్పడుతున్నారు. ఇప్పటికే ఆయన వెనిజులాను ఆధీనంలోకి తీసుకోగా.. మరోవైపు ఇరాన్‌ (Iran)పై సైనిక చర్యను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు.

డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల కారణంగా ఇతర దేశాల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈసారి డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగ బెదిరింపు జారీ చేసింది ఇరాన్. అయితే 2024 జూలై‌లో ట్రంప్‌ హత్యాయత్నంలో తమకు సంబంధం ఉందని ఇరాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ హత్యాయత్నంలో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనకు సంబంధించిన ప్రసారాలను ఇరాన్ (Iran) టీవీలో ప్రసారం చేస్తూ ‘‘ఈసారి బుల్లెట్ మిస్ అవ్వదు” అని చెప్పింది.

ఇరాన్ ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తులలో ఒకరైన డొనాల్డ్ ట్రంప్‌పై బహిరంగ బెదిరింపులకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది రెండు దేశాలకు మంచిది కాకపోవచ్చు. ట్రంప్ నిర్ణయాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇతర దేశాలు సైతం ఉత్కంఠగా అమెరికా వైపు చూస్తున్నాయి.

Read Also: సీఎం మమతా బెనర్జీపై ఈడీ సంచలన ఆరోపణలు..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>