మనకు వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు నాణ్యమైన నిద్ర(Quality Sleep) లేకపోవడం ఒక కారణమని వైద్యులు చెప్తుంటారు. ఒక్కరోజు నాణ్యమైన నిద్ర లేకపోతే.. దాని ప్రభావం వారం రోజుల పాటు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అసలు ఇంతకీ నాణ్యమైన నిద్ర అంటే ఏంటి? గంటల తరబడి బెడ్‌కు అదుక్కుపోయి పడుకోవడమా? అంటే కాదంటున్నారు వైద్యులు. బెడ్‌పై గంటలకు గంటలు పడుకుని నిద్రపోతుంటే సరిపోదని, అందులో నాణ్యత ఉండాలని చెప్తున్నారు. దీంతో అసలు నాణ్యమైన నిద్ర ఏంటి? అనే ప్రశ్న తలెత్తుతుంది.
వైద్యులు చెప్తున్న ప్రకారం అయితే.. నాణ్యమైన నిద్ర(Quality Sleep) అంటే.. పడుకున్న తర్వాత నుంచి ఉదయం లేచే వరకు ప్రశాంతంగా నిద్రపోవడం, మధ్య మధ్యలో మెలకువ వస్తుందంటే అది నాణ్యమైన నిద్ర కాదని వైద్యులు చెప్తున్నారు. ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు నాణ్యమైన నిద్ర పోతే అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరవని చెప్తున్నారు. అంతేకాకుండా నిద్ర మేలుకున్నాక చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందని, శరీరం, మనసు, మెదడు చాలా తేలికగా, ఆహ్లాదకరంగా ఉంటాయని చెప్తున్నారు.
కొంతమందికి బెడ్డుపై పడుకోవడం ఆలస్యం నిద్ర అలా కమ్ముకొచ్చేస్తుంది. కానీ, కొందరికి మాత్రం బెడ్‌పై పడుకున్న గంటల తరబడి కూడా నిద్ర రాదని, అతి కష్టంపైన నిద్ర పడుతుంది. అయినా సరే.. ఒక్కసారి నిద్రలోకి జారుకున్న తర్వాత 7 నుంచి 8 గంటల పాటు మేలుకోకుండా నిద్రపోతే చాలు. అది నాణ్యమైన నిద్రే అవుతుంది. అది చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రపంచంలో ప్రతి నలుగిరిలో ఒకరికి నిద్ర సమస్యలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్యల వల్ల అనుకున్న సమయానికి నిద్ర మేల్కోవడం కష్టం అవుతుంది. వయసు పెరిగే కొద్ది సమస్యలు పెరుగుతాయి. దీని కారణంగానే రాత్రిపూట నిద్రలో శ్వాస ఆగిపోయే స్లీప్ అప్నియా వంటి సమస్యలు కూడా రావొచ్చని అంటున్నారు వైద్యులు. ఈ నిద్ర సమస్యలు మనం తీసుకునే ఔషధాలు, అనారోగ్యం, ఇంట్లో ఇతరత్రా శబ్దాలు ఇలా కారణం ఏదైనా మనకు నిద్ర భంగం కలగొచ్చొచ్చు. కానీ అదే రోజూ కంటిన్యూ అయితే మాత్రం సమస్యలు తప్పవు. నిద్రకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
Read Also: టీ-షర్ట్‌లో ‘T’కి అర్థం ఏంటో తెలుసా..?

