కలం, వెబ్ డెస్క్: జార్ఖండ్‌లోని (Jharkhand) హజారీబాగ్ (Hazaribagh) జిల్లాలో బుధవారం సాయంత్రం ఒక భీకర పేలుడు సంభవించింది. హబీబ్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు మరో మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి పునాది కోసం భూమిని తవ్వుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భూమిని తవ్వుతున్న సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ ఘటనలో మహమ్మద్ సద్దాం, ఆయన భార్య నన్హీ పర్వీన్, రషీదా అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం హజారీబాగ్ (Hazaribagh) లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
Read Also: ఐఎన్ఎస్వీ కౌండిన్య: అజంతా గుహల నుంచి.. అరేబియా ద్వీపకల్పంలోకి
Follow Us On: Youtube


