కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections)కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పరిశీలించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలకు సంబంధించి బీసీలకు 31.4 శాతం, మున్సిపల్ కార్పొరేషన్లకు 30 శాతం స్థానాలను కేటాయించింది. 14 శాతం ఎస్సీలకు, 4.13 శాతం ఎస్టీలకు ఖరారు చేసింది. మొత్తం 121 మున్సిపాలిటీల్లో జనరల్ 30, జనరల్ మహిళ 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19. ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2 స్థానాలను కేటాయించనున్నారు. అలాగే, 10 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలకు సంబంధించి ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ 3, జనరల్ మహిళ 4 స్థానాలు కేటాయించగా ఒక స్థానం అన్ రిజర్వ్డ్ చేశారు.
Read Also: భూమి తవ్వుతుండగా భారీ పేలుడు.. ముగ్గురు మృతి
Follow Us On: X(Twitter)


