epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

లండన్​లో పాక్​ ముఠా అరాచకం.. సిక్కు మైనర్​ బాలిక గ్యాంగ్​ రేప్​

కలం, వెబ్​డెస్క్​: లండన్​లో పాకిస్థాన్ గ్రూమింగ్​ గ్యాంగ్ (Pak Grooming Gang)​ అరాచకం మరొకటి బయటపడింది. ఓ సిక్కు మైనర్ బాలిక (Sikh Teen) ను ఈ ముఠా గ్యాంగ్​ రేప్ చేసింది. వాళ్ల చెర నుంచి ఆ అమ్మాయి(16)ని విడిపించడానికి దాదాపు 200 మంది సిక్కులు రంగంలోకి దిగారు. ఆ ముఠా ఉంటున్న స్థావరాన్ని చుట్టుముట్టారు. అమ్మాయిని విడిపించడడంతోపాటు ముఠాలో ఒకరిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది.

లండన్​లోని (London) సిక్కు కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. పాక్​ గ్రూమింగ్​ గ్యాంగ్​లోని (Pak Grooming Gang) ఒక వ్యక్తి (40) ఆ అమ్మాయికి 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే స్నేహం పెంచుకున్నాడు. చివరికి రెండు రోజుల కిందట ఆ అమ్మాయిని తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ అతనితోపాటు మరో ఆరుగురు ఆ సిక్కు బాలికను రేప్ ​చేశారు. అమ్మాయి కనిపించకపోవడంతో అనుమానించిన ఆమె కుటుంబ సభ్యులు, సిక్కు కమిటీకి విషయం చెప్పారు. దీంతో వాళ్లంతా కలసి నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. అమ్మాయిని విడిపించి, నిందితుని పట్టుకున్నారు.

ఏమిటీ గ్రూమింగ్ గ్యాంగ్​లు?

లండన్​లో దాదాపు నలభై ఏళ్ల నుంచి ఈ గ్రూమింగ్​ గ్యాంగ్​ల ఆనవాళ్లుఉన్నాయి. పాకిస్థాన్​ నుంచి వచ్చినవాళ్లు ఇలా ముఠాలుగా ఏర్పడతారు. వీళ్ల టార్గెట్​ 11–16 ఏళ్ల లోపు అమ్మాయిలు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉన్న ఇళ్లలోని అమ్మాయిలకు కావాలనే దగ్గరవుతారు. వాళ్లకు బహుమతులు ఇవ్వడం, ప్రేమతో నమ్మకం కలిగించడం, భయపెట్టడం లేదా బెదిరించడంతో తమ వైపు తిప్పుకుంటారు. ఆ తర్వాత తమ వెంట తీసుకెళ్లి రేప్​ చేసి ఉమెన్ ట్రాఫికింగ్​ ముఠాలకు అమ్మేస్తారు.

వీళ్ల దురాగతాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. 1997 నుంచి 2013 మధ్య దాదాపు 1,400 మంది చిన్నారులను వీళ్లు ఇలా ట్రాప్​ చేశారు. ఈ గ్రూమింగ్​ గ్యాంగ్​ల గురించి బ్రిటన్​ ఎంపీ ఒకరు తమ దేశ పార్లమెంట్​లో ప్రస్తావించారు. ఈ గ్రూపులను నిషేధించి వెళ్లగొట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, లండన్​తోపాటు దేశమంతా ముస్లిం కమ్యూనిటీవాళ్లు ఎక్కువ ఉండడంతో  ప్రభుత్వం వెనకడుగు వేసింది. మరోవైపు ఈ ముఠాల అరాచకం మీద ఎలాన్​ మస్క్​ సైతం గతంలో స్పందించారు. అమాయక చిన్నారులను బలి తీసుకుంటున్న ఈ ముఠాలను తరిమికొట్టాలని ‘ఎక్స్​’ వేదికగా పేర్కొన్నారు. కానీ, బ్రిటన్​ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

Read Also: ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచనలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>