epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచనలు

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల (Iran Crisis ) నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. ఇరాన్ లో ఉంటున్న భారత పౌరులను అప్రమత్తం చేస్తూ.. భారత విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, టూరిస్టులు తక్షణమే ఇరాన్ ను విడిచి వెళ్లాలని పేర్కొంది. అందుబాటులో ఉన్న రవాణా సాధనాల ద్వారా వెంటనే వెళ్లిపోవాలని పేర్కొంది. ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

ప్రాంతీయ ఉద్రిక్తతలకు తోడు అమెరికా దాడులు (America Attacks) చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ (Indian Embassy) కీలక సూచనలు చేసింది. ఆందోళనలు, ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలపై వైపు వెళ్లకూడదని సూచించింది. స్థానిక వార్తలను, భారత ఎంబసీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను నిరంతరం పర్యవేక్షించాలని కోరింది. భద్రత కోసం వీలైనంత త్వరగా ఇరాన్ నుండి బయటపడటమే ఉత్తమం అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే విదేశాంగ శాఖ ఇరాన్ కు ప్రయాణించొద్దని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ లో జరుగుతున్న ఉద్రిక్తతల్లో (Iran Crisis)  2,500 మందికిపై మరణించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి.

Read Also: కెనడాలో భారతీయ బిజినెస్​మ్యాన్​ కాల్చివేత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>