epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఐఎన్​ఎస్​వీ కౌండిన్య: అజంతా గుహల నుంచి.. అరేబియా ద్వీపకల్పంలోకి

కలం, వెబ్​డెస్క్​: అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోయడం సాధ్యం అవునో కాదో కానీ ఎప్పుడో వేల ఏళ్ల కిందటి ఓ చిత్రానికి మాత్రం భారత నేవీ అధికారులు ప్రాణం పోశారు. ఆశ్చర్యంగా ఉందా? భారత నేవీ రూపొందించిన ఐఎన్​ఎస్​వీ కౌండిన్య (INSV Kaundinya) నౌక దీనికి ఉదాహరణ. మహారాష్ట్రలోని అజంతా గుహల్లో చిత్రించిన 5వ శతాబ్దం నాటి ఓ నౌకను చూసి దీన్ని తయారుచేశారు. పూర్తిగా పాతకాలం పద్ధతిలో.. మేకులు, ఇనుప వస్తువులు వాడకుండా, కొబ్బరి పీచు, చెక్కలు, తెరచాపలు, సహజసిద్ధమైన జిగురుతో తయారుచేసిన ఈ నౌకే ఒక అద్భుతం అనుకుంటే ఇప్పుడిది మరో ఘనత సాధించింది.

INSV Kaundinya

గత నెల గుజరాత్​లోని పోర్​బందర్​ నుంచి అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం సాగించిన ఐఎన్​ఎస్​వీ కౌండిన్య.. అరేబియా ద్వీపకల్పంలోని దేశమైన ఒమన్​లోని మస్కట్​లో ఉన్న పోర్ట్​ సుల్తాన్​ ఖబూస్​ ఓడరేవుకు చేరింది. ఈక్రమంలో ఇంజిన్లు లేకుండా కేవలం గాలి ఆధారంగా 1,400 కి.మీ దూరం ప్రయాణించింది. 18 రోజుల్లో ఇది తన గమ్యాన్ని చేరుకుంటుందని జర్నీ స్టార్ట్​ చేసినప్పుడు భావించినప్పటికీ ఒకరోజు ముందుగానే ఒడ్డుకు​ చేరింది. ఈ నౌకకు కమాండర్​ వికాస్​ షెరాన్​ సారథ్యం వహించగా, మరో 16 మంది సిబ్బంది ఉన్నారు. నౌక తీరాన్ని చేరగానే వీళ్లంతా సంతోషంతో సంబరాలు జరుపుకొన్నారు. కాగా, కేరళకు చెందిన బాబు శంకరన్​ నేతృత్వంలోని కళాకారులు తయారుచేసిన ఈ నౌక నిరుడు ఫిబ్రవరిలో భారత నేవీలోకి చేరింది.

INSV Kaundinya
INSV Kaundinya

Read Also: శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పరవశించిన అయ్యప్ప భక్తులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>