epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కెనడాలో భారతీయ బిజినెస్​మ్యాన్​ కాల్చివేత

కలం, వెబ్​డెస్క్​: కెనడాలో భారతీయ బిజినెస్​మ్యాన్​ను దుండగులు కాల్చి చంపారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. భారత్​లోని పంజాబ్​కు చెందిన బిందర్​ గర్చా(Bindar Garcha) కెనడాలోని సర్రే సిటీలో స్టూడియో–12 నడుపుతున్నారు. సర్రే–వాంకోవర్​ రీజియన్​లో ఫోటోగ్రీఫీ బిజినెస్​ చేస్తున్నారు.  ఈ క్రమంలో సర్రేలోని 176 స్ట్రీట్​ 35 ఎవెన్యూ వద్ద బిందర్​ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అత్యంత సమీపం నుంచి అతడిని కాల్చి చంపినట్లు గుర్తించారు. హత్యకు కారణాలు తెలియరాలేదు.

హత్య జరిగిన ప్రాంతంలో కాలిపోయిన ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు. మరోవైపు, గత శుక్రవారం కెనడాలోని వెస్ట్​ అబాస్ట్​ఫోర్డ్​లో నవ్​ప్రీత్​ సింగ్ (28)​ ధలివాల్​ అనే మరో భారత యువకుడిని ఇలాగే కాల్చి చంపారు. కెనడాలో పుట్టిన నవప్రీత్​ను తామే చంపినట్లు డేనీ బల్​ గ్యాంగ్​ ముఠా ప్రకటించింది. ఈ ముఠా కెనడాలో డ్రగ్​ వ్యవహారాలు నడుపుతుంటుంది. కెనడాలో కొన్ని రోజులుగా ఇలాంటి సంఘటనలు  సర్వసాధారణం అయ్యాయి. నెల వ్యవధిలో ఏకంగా ముగ్గురు భారతీయులు హత్యకు గురయ్యారు.

Bindar Garcha
Bindar Garcha

Read Also: పోలీస్​​ వాహనం పేల్చివేత.. ఏడుగురు దుర్మరణం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>