epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పోలీస్​​ వాహనం పేల్చివేత.. ఏడుగురు దుర్మరణం

కలం, వెబ్​డెస్క్​: పాకిస్థాన్ (Pakistan) ​లో పోలీస్​ వాహనాన్ని పేల్చివేయడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన బుధవారం ఖైబర్​పఖ్తూంక్వా రాష్ట్రంలోని టంక్​ జిల్లాలో జరిగింది. పోలీస్​ సిబ్బంది వాహనంలో గస్తీ నిర్వహిస్తుండగా, రోడ్డు కింద పాతిపెట్టిన శక్తిమంతమైన ఐఈడీ బాంబ్​ను రిమోట్​తో పేల్చడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది. ఇందులో బాంబు దాడి అనంతరం మిగిలిన పోలీస్​ సిబ్బందిపై దుండగులు కాల్పులు జరపడం చూడవచ్చు.  ఈ దురాగతానికి పాల్పడింది తెహ్రీక్ ఇ తాలిబాన్​ పాకిస్థాన్​(టీటీపీ)కి చెందినవాళ్లని టంక్​ జిల్లా డిప్యూటీ  పోలీస్​ చీఫ్​ పర్వేజ్​ షా వెల్లడించారు. చనిపోయినవాళ్లలో ఒక ఎస్​ఐ,స్టేషన్​ హౌస్ఆఫీసర్​, నలుగురు కానిస్టేబుల్స్​, డ్రైవర్​ ఉన్నట్లు తెలిపాడు.

కాగా, కొంతకాలంగా పాక్ (Pakistan)​ లో పోలీసులు, సైన్యంపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్​ సరిహద్దులోని ఖైబర్​ పఖ్తూంక్వాలో టీటీపీ, బెలూచిస్తాన్​లో బెలూచ్​ లిబరేషన్​ ఆర్మీ దాడులు చేస్తోంది. రెండు  రోజుల కిందట కూడా నలుగు శాంతి కమిటీ సభ్యులను కాల్చి చంపారు. కాగా, టీటీపీని ఆఫ్ఘనిస్థాన్​ ఎగదోస్తోందంటూ పాక్ మంత్రి మోహిసిన్​ నఖ్వీ మండిపడ్డారు.

Read Also: రిజర్వుడ్​కు 0, జనరల్​కు 7 పర్సంటైల్​.. నీట్​ పీజీ కటాఫ్​ తగ్గింపు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>