epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం.. వీడియో వైరల్..!

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఓ చిరుత పులి (Leopard) రోడ్డు దాడుతుండగా జనాల కంట పడింది. లింగంపేట మండలం మెంగారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత కనిపించింది. లింగంపేటకు చెందిన సాజిద్ ఖాన్ అనే వ్యక్తి కారులో కామారెడ్డి నుంచి లింగంపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారిపై ఓ చిరుత పులి మెంగారం అటవీ ప్రాంతంలో కారుకు అడ్డుగా రోడ్డు దాటుతోంది. ఒక్కసారిగా చిరుతను చూసి భయాందోళనకు గురై కారును నిలిపివేశాడు. చిరుత సంచారాన్ని, రోడ్డు దాటుతున్న దృశ్యాలను తన సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. చిరుత ఓసారి కుడివైపు మళ్లీ అటువైపు నుంచి ఎడమవైపునకు రెండుసార్లు రోడ్డు దాటుతూ కనిపించింది.

అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. చిరుత సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరించారు. చిరుత సంచారంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. గత పది రోజులుగా చిరుత లింగంపేట మండలంలో పలు గ్రామాలలో సంచరిస్తున్నట్లుగా ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. కొన్నాళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సుకు చిరుత పులి అడ్డు తగిలింది. దీంతో బస్సులోని ప్రయాణికులు చిరుత సంచరిస్తున్న దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధించారు. ఈసారి కూడా చిరుత దృశ్యాలు ఆయా గ్రామాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Also: సీఎం ఇంటి ముందు వృద్ధుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>