కరీంనగర్(Karimnagar) జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో(Kurikyala school) విద్యార్థినుల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ దారుణానికి పాల్పడిన అటెండర్ యాకూబ్ బాషాపై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. ఈ అంశంపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాల ఫొటోలను కూడా తీసిన అటెండర్ వాటిలో విద్యార్థినుల ఫొటోలను మార్ఫింగ్ చేశాడని, ఆ తర్వాత వాటిని చూపి పలువురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
యాకుబ్ రెండేళ్లుగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న విద్యార్థులు.. వారం కిందట అసలు విషయాన్ని తమ తల్లిదండ్రులు, అధికారులకు వెల్లడించారు. దీంతో ఈ విషయం బట్టబయలయింది. ఈ విషయం తెలిసిన వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాకుబ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తల్లిదండ్రులకు భరోసా కల్పించండి: బండి సంజయ్
కరీంనగర్(Karimnagar)లో చోటు చేసుకున్న ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిందితుడి దగ్గర ఉన్న ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకుని, విద్యార్థినుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని బండి సంజయ్ సూచించారు.
Read Also: నాలుగేళ్ల చిన్నారిపై మైనర్ అత్యాచారం..

