ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. మొంథా తీవ్ర తుఫానుగా మారింది. పలు జిల్లాలకు వరద ముప్పు ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. దీంతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan).. తన తాడేపల్లి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ ఆఫీసు అధికారికంగా ప్రకటించింది. తుపాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దుచేశారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే జగన్.. బుధవారం తాడేపల్లికి వస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తుఫాను బాధిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్(YS Jagan) సూచించారు. ముందుజాగ్రత్త, సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ జిల్లాలకు వరద హెచ్చరిక..
గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే అవనిగడ్డలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ‘మొంథా(Cyclone Montha)’ తుఫాను మంగళవారం సాయంత్రం, లేదా రాత్రికి కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్న కేంద్ర వాతావరణ శాఖ ఏపీ, యానాం, దక్షిణ ఒడిశాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
Read Also: కోనసీమలో ‘మొంథా’ బీభత్సం..

