కలం, మెదక్ బ్యూరో: అన్నం పెట్టే రైతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy) అన్నారు. ముఖ్యంగా యువ రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్లో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఎల్లా రాజిరెడ్డి కుటుంబాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడంతోపాటు ఆర్థిక సాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. అప్పులతో రైతులు చనిపోతుండటం తన మనసుకు తీవ్ర బాధ కలిగిస్తోందన్నారు. చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు.
Read Also: వందే భారత్ స్లీపర్.. ఆ కేటగిరీ టికెట్లకు నో
Follow Us On: Pinterest


