epaper
Friday, January 16, 2026
spot_img
epaper

బీఆర్ఎస్‌కు భయపడే ఇండిపెండెంట్లను దించారు: హరీష్

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక సూచనలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులకు కూడా కారును పోలి ఉండే గుర్తులు ఇచ్చారని, వాటిని చూసి మోసపోవద్దని అన్నారు. అంతా జాగ్రత్తగా చూసుకుని మూడో నెంబర్‌లో ఉండే కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్‌(BRS)ను చూసి భయపడే రేవంత్(Revanth Reddy).. ఇండిపెండెంట్లను పెట్టారని హరీష్ రావు ఆరోపించారు. ‘‘ఆ ఇండిపెండెంట్ల గుర్తులు కారును పోలినట్లే రోడ్డు రోలర్, చపాతి రోలర్, సబ్బు పెట్టే గుర్తులు ఉన్నాయి. కాబట్టి ముసలొల్లు జాగ్రత్తగా చూసి కారు గుర్తుకు ఓటు వెయ్యండి’’ అని హరీష్ కోరారు.

‘‘కేసీఆర్(KCR) వచ్చిన తర్వాతే చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని రాష్ట్రానికి చెప్పి.. ఆ అమ్మగారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరిపింది పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల్లో చెప్పక పోయినా మా రజకులకు, నాయీబ్రాహ్మణులకు కరెంటు బిల్ లేకుండా చేసింది కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్లకు బిల్లులు పంపుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక ఇస్తిరి పెట్టే నడిపుకునే ఆమెకు 55 వేల కరెంటు బిల్లు కట్టమని పంపిండు, ఇంకొక ఆమెకు 31 వేల బిల్లు పంపిండు. జూబ్లీహిల్స్‌లో ఈ బిల్లులు ఆగాలి అంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్ మనాలి’’ అని Harish Rao అన్నారు.

Read Also: సీజేఐ రేసులో జస్టిస్ సూర్యకాంత్.. !

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>