కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మార్కెట్ రోడ్డులోని లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఈనెల 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశం జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులంతా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) కోరారు.
Read Also: సచివాలయం @ కమాండ్ కంట్రోల్
Follow Us On: X(Twitter)


