కలం, వెబ్ డెస్క్ : మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జన నాయగన్ (Jana Nayagan) చిత్ర నిర్మాత ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కూడా అత్యున్నత న్యాయస్థానంలో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలను వినకుండా ఈ విషయంలో ఎటువంటి ఆదేశాలు జారీ చేయవద్దని బోర్డు తన పిటిషన్‌లో కోరింది.
ఈ వివాదం మొదట మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ వద్దకు రాగా, జన నాయగన్ (Jana Nayagan) సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వాలని అప్పట్లో కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పును CBFC డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయడంతో, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణను మద్రాస్ హైకోర్టు జనవరి 21కి వాయిదా వేసింది. ఈ లోపే అటు నిర్మాత, ఇటు సెన్సార్ బోర్డు సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: శ్రీలీల తప్పేముంది..?
Follow Us On: Sharechat


