కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ వేళ మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి.. మిగతా అన్ని మద్యం బ్రాండ్లపై ఒక్కో సీసా మీద రూ.10 పెంచింది (Liquor Prices) ప్రభుత్వం. పెంచిన వాటిల్లో IMFL, FL, బీర్, వైన్ లాంటి అన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయి. అలాగే మద్యం అమ్మకాల్లో రిటైలర్లకు ఇచ్చే మార్జిన్ ను కూడా ప్రభుత్వం 1 శాతం పెంచింది. బ్రాండ్లపై రూ.10 పెంచడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.1,391 కోట్ల దాకా అడిషనల్ ఇన్ కమ్ వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ లో మద్యానికి భారీ డిమాండ్ ఉంటుంది. ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగ ముందు పెంచడం వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం చేకూరే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు.
Read Also: సంక్రాంతి వేళ మటన్, చికెన్ ధరలకు రెక్కలు..!
Follow Us On: X(Twitter)


