epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచిన ప్రభుత్వం

కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగులకు (Govt Employees) తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 30.03 శాతం నుంచి 33.67 శాతానికి అంటే 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 2023 జులై నెల నుంచి ఈ డీఏ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జనవరి నెల జీతంతో పాటు పెంచిన డీఏను ఫిబ్రవరి 1న చెల్లించనుంది ప్రభుత్వం. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు కూడా ఈ పెంచిన డీఏ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ డీఏను పెంచినట్టు కొద్ది సేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: వందే భారత్​ స్లీపర్​.. ఆ కేటగిరీ టికెట్లకు నో

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>