epaper
Friday, January 16, 2026
spot_img
epaper

క్యాబినెట్ రీషఫ్‌ల్.. తనకేం తెలీదన్న మంత్రి

మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ వార్తలపై కర్ణాటక(Karnataka) హోంమంత్రి జీ పరమేశ్వర స్పందించారు. తనకేం తెలీదన్నారు. ఇప్పటి వరకు మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని, ఉంటే చెప్తామని అన్నారు. ‘‘పార్టీ హైకమాండ్ చెప్పే వరకు ఇది అప్రస్తుతం. ఇప్పటి వరకు అయితే క్యాబినెట్ రీషఫ్‌ల్ గురించి నాకు ఎటువంటి సమాచారం రాలేదు. బీహార్ ఎన్నికల తర్వాత సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్తారు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. పునఃవ్యవస్తీకరణపై ఒక క్లారిటీ కూడా రావొచ్చు’’ అని వెల్లడించారాయన.

అయితే మంత్రి వర్గ విస్తరణ చేయమని పార్టీ హైకమాండ్ తనకు నాలుగు నెలల క్రితమే చెప్పిందని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. కానీ తన ప్రభుత్వం సగం గడువు అంటే రెండున్నర సంవత్సరాలు ముగించుకున్న తర్వాత క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌పై ఆలోచిస్తానని చెప్పానని సిద్దరామయ్య వివరించారు. ‘‘ఒక్కసారి రెండున్న సంవత్సరాల మైలురాయిని చేరుకున్నాక.. చర్చలు చేసి హైకమాండ్ సూచనల మేరకు ముందుకు కొనసాగుతాం. నవంబర్ 16న షెడ్యూల్ చేసిన తన ఢిల్లీ పర్యటనలో పార్టీ అధిష్టానంతో సమావేశమవుతా. అందులో రాష్ట్రంలోని పాలన, జరుగుతున్న అభివృద్ధిపై వివరిస్తా. అది మా బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. దాంతో కర్ణాటక(Karnataka) మంత్రివర్గ పునఃవ్యవస్తీకరణ జరగనుందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో తాజాగా దీనిపై రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర(Parameshwara) స్పందించారు.

Read Also: వీధి కుక్కలకు టీకాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>