కలం, వెబ్ డెస్క్ : నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). జనవరి 14 విడుదలవుతున్న ఈ సినిమాకు టికెట్ ధరల పెంపునకు (Ticket Rates Hike) ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 (జీఎస్టీతో సహా) పెంచుకోవచ్చు. ఈ సవరించిన టికెట్ ధరలు సినిమా విడుదలైన తేదీ నుండి 10 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటాయి.
ఈ పెంపుదల విడుదలైన మొదటి రోజు నుండి ఐదు అదనపు షోలకు కూడా వర్తిస్తుంది. దర్శకుడు మారి, నిర్మాత సాహు గారపాటి (సితారా ఎంటర్టైన్మెంట్స్) తెరకెక్కిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి సానుకూల స్పందన అందుకున్నది. అయితే, ఇంత తక్కువ బడ్జెట్, చిన్న సినిమాకు కూడా టికెట్ రేట్స్ హైక్ ఎందుకంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చిన్న సినిమాలకు ఇది మాంచి బూస్ట్ ఇస్తుంది మూవీ లవర్స్ భావిస్తున్నారు.

Read Also: బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ లో రివ్యూ ఆప్షన్ ఉండదా ?
Follow Us On: Sharechat


