కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో రాజధాని కట్టకూడదు.. గుంటూరు -విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తే బాగుంటుందని జగన్ తెలిపారు. రివర్ బేసిన్‌లో భవనాలు ఎలా నిర్మిస్తారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ మాటలకు కౌంటర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బుద్ది చెప్పిన రాజధానిపై జగన్ విషం చిమ్మడం మానట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నాగరికత తెలిస్తే నదుల గురించి అలాంటి దుష్ప్రచారం చేయరు. నదీగర్భం, నదీ పరీవాహక ప్రాంతానికి తేడా తెలిస్తే జగన్ అలా మాట్లాడేవారు కాదని చంద్రబాబు అన్నారు.
Read Also: బాబు కోసం బండ్ల గణేష్ పాదయాత్ర?
Follow Us On: X(Twitter)


