epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కేంద్ర ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో డీఏ 63 శాతం!

కలం డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నది. ఆరునెలకోసారి ఇచ్చే డీఏ (Dearness Allowance), డీఆర్ (Dearness Relief) ను ఈ సారి 61 నుంచి 63 శాతానికి చేర్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నది. పెరిగిన ధరల నేపథ్యంలో ఆ మేరకు పెంచాలని ఎంప్లాయీస్ కూడా కోరుతున్నారు. లాస్ట్ టైమ్ 2025 జులైలో 58శాతం డీఏను సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. అంతకు ఆరు నెలల ముందు 55 శాతం ఉండగా.. 3 పర్సెంటేజీ పెంచి అమలులోకి తెచ్చింది. ఈ జనవరి నుంచి రావాల్సిన కొత్త డీఏకు మరో 3 నుంచి 5 శాతం పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ (8th Pay Commission) ను ఏర్పాటు చేసింది. కమిషన్ తన ప్రక్రియను వేగవంతం చేసింది.

పెరిగిన లివింగ్ కాస్ట్

ఇప్పుడు అమలవుతున్న 58 శాతం డీఏకు మరో 3 నుంచి 5 శాతం పెంచాలన్న డిమాండ్ కు ఆహారం, లివింగ్ కాస్ట్ పెరగడమే కారణం. నిరుడు నవంబర్ లో కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) 148.2 పాయింట్లకు చేరుకుంది. అంటే అన్ని రకాల ధరలు భారీగా పెరిగాయి. డీఏ పెంపులో ఈ ఇండెక్స్ ను పరిగణనలోకి తీసుకుంటారు. వారం పదిరోజుల్లో డీఏ, డీఆర్‌పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డీఏ పెంపుతో కోటీ 19 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇందులో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. 69 లక్షల మంది వరకు పెన్షనర్లు ఉన్నారు. పెన్షనర్లకు డీఆర్ వర్తిస్తుంది.

Read Also: మియాపూర్​లో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>