కలం వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా “మన శంకర వరప్రసాద్ గారు” కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ల ధరలు (MSVPG Ticket Price) పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600కు పెంచుకోవడానికి, అలాగే రిలీజ్ అయిన వారంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100గా టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతించింది.
ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇటీవల విడుదలైన ప్రభాస్ రాజాసాబ్ మూవీకి చివరి క్షణం వరకు టికెట్ల ధర పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వకుండా, మెగాస్టార్ మూవీకి మాత్రం ముందే అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా టికెట్ల ధరల (MSVPG Ticket Price) పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Read Also: ఆటోలో ప్రయాణించిన మంచు మనోజ్ దంపతులు.. వీడియో వైరల్
Follow Us On: Sharechat


