కలం, వెబ్ డెస్క్: చెల్సీ క్లబ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడమే ప్రస్తుతం తన టార్గెట్ అని క్లబ్ కొత్త మేనేజర్ లియామ్ రోజెనియర్ (Liam Rosenior) స్పష్టం చేశారు. శనివారం ఎఫ్ ఏ కప్‌లో చార్ల్టన్‌తో జరిగే మ్యాచ్ ద్వారా ఆయన చెల్సీ బాధ్యతలు తొలిసారిగా చేపట్టనున్నారు. 41 ఏళ్ల రోజెనియర్ బ్లూకో యాజమాన్యంలో ఉన్న స్ట్రాస్‌బర్గ్‌లో విజయవంతమైన కోచింగ్ తర్వాత చెల్సీ బాధ్యతలు స్వీకరించారు. ఎంజో మారెస్కా రెండు ట్రోఫీలు గెలిచినా ప్రీమియర్ లీగ్‌లో నిరాశాజనక ఫలితాల కారణంగా జనవరి 1న పదవి వీడారు.
చెల్సీ గత తొమ్మిది లీగ్ మ్యాచ్‌లలో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. వచ్చే సీజన్ ఛాంపియన్స్ లీగ్ అర్హత కోసం టాప్ ఫోర్ లక్ష్యంగా రోజెనియర్ (Liam Rosenior) బాధ్యతలు చేపట్టారు. జట్టులో ఉన్న ప్రతిభ ప్రపంచ స్థాయి అని రోజెనియర్ తెలిపారు. ఎంజో వ్యూహాత్మకంగా మంచి పని చేశారని అన్నారు. దానిని మరింత మెరుగుపరచడమే తన పని అని స్పష్టం చేశారు. భయం ఉంటే కోచ్‌గా కొనసాగడం సాధ్యం కాదని చెప్పారు. రోజుకు 24 గంటలు కష్టపడతానని వెల్లడించారు.
ఫులమ్ చేతిలో చెల్సీ ఓడిపోయిన మ్యాచ్‌ను రోజెనియర్ స్టాండ్స్ నుంచి వీక్షించారు. ఆ మ్యాచ్ సమయంలో అభిమానులు బ్లూకో నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యానికి లోబడి పనిచేస్తున్నానన్న ఆరోపణలను రోజెనియర్ ఖండించారు. మేనేజర్‌గా ఉంటే నిర్ణయాలు తానే తీసుకోవాలని అన్నారు. స్ట్రాస్‌బర్గ్‌లో అమలు చేసిన విధానాన్నే ఇక్కడ కూడా కొనసాగిస్తానని తెలిపారు.
యువ ఆటగాళ్లపై ఆధారపడే విధానం విజయవంతమవుతుందనే నమ్మకం తనకు ఉందని రోజెనియర్ చెప్పారు. అభిమానుల మద్దతు పొందాలంటే మ్యాచ్‌లు గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. కాలక్రమంలో ఈ విధానం సరైనదని నిరూపిస్తామని అన్నారు.


