కలం, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ (Raja Saab) మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. అన్ని భాషల్లో మొదటి రోజు అద్భుతమైన ప్రదర్శనతో భారీ అంచనాలను అందుకుంది. ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇది భారీ కలెక్షన్లు సాధించేందుకు ఉపయోగపడింది.
శుక్రవారం కలెక్షన్లతోసహా మొదటి రోజు ది రాజా సాబ్ (Raja Saab) ఇండియాలో రూ. 112 కోట్ల వసూళ్లను రాబట్టింది. తెలుగు వెర్షన్ రూ. 47.4 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, హిందీ వెర్షన్ రూ. 6.15 కోట్లు రాబట్టింది. తమిళం, కర్ణాటక, మలయాళం మార్కెట్ల నుంచి వరుసగా 4, 1, 1 కోట్లు వసూలు చేసింది. అలాగే మరికొన్ని ఏరియాల్లో కలిపి 58 కోట్లు వసూలు చేసింది. గురువారం ప్రీమియర్ షోలు ద్వారా మాత్రమే తెలుగు మార్కెట్లలో రూ. 9.15 కోట్ల వసూళ్లను (Collections) సాధించాయి. మొదటి రోజే ఈ సినిమా అనుకున్నదానికంటే వసూళ్లను సాధించింది. వీకెండ్ కావడం, సంక్రాంతి సెలవులు ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇదే ఊపును కొనసాగించగలదు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
Read Also: ఎన్టీఆర్ నుంచి కాలర్ ఎగరేసే అనౌన్స్మెంట్ రానుందా..?
Follow Us On: Instagram


