కలం వెబ్ డెస్క్ : నిజామాబాద్‌లో ఇటీవల వరుస ఏటీఎం చోరీలు మరువకముందే కామారెడ్డిలో (Kamareddy) మరోసారి దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఐదు షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. రూ.5 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు చోరీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు చోరీ జరిగిన దుకాణాలకు చేరుకొని పరిశీలించారు. మరోవైపు రామారెడ్డి మండలంలో ఓ దొంగల ముఠా స్థానిక వృద్ధురాలు గంగవ్వ ఇంట్లో చొరబడింది. నాలుగు తులాల బంగారం, 45 తులాల వెండి ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఆధారాల ద్వారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీలన్నింటి వెనుక ఒకే ముఠా ఉందా? లేక వేర్వేరు దొంగతనాలా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
Read Also: ‘బోధన్ షుగర్స్’ రీ-ఓపెన్.. మైలేజ్ పొందేలా కాంగ్రెస్ ప్లాన్
Follow Us On: Pinterest


