కలం వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas).. మైథలాజికల్ మూవీని చేయబోతున్నట్టుగా ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో భారీ సినిమా చేస్తున్నాడు. దీనికి డ్రాగన్ అనే టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ.. ఈ టైటిలే గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు మరో పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల త్రివిక్రమ్.. మైథలాజికల్ మూవీని ఎన్టీఆర్ తో కాకుండా బన్నీతో చేయాలి అనుకుంటున్నట్టుగా ఓ వార్త వైరల్ అయ్యింది.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు నిర్మాత నాగవంశీ.. అనగనగా ఒక రాజు ట్రైలర్ ఈవెంట్ కి వెళ్లినప్పుడు అక్కడ కాలర్ ఎగరేయడం గురించి అభిమానులు అరవడం.. దీనికి నాగవంశీ.. మే నెలలో కాలర్ ఎగరేద్దాం అనడం హాట్ టాపిక్ అయ్యింది. మేటర్ ఏంటంటే.. మే నెలలో 20న ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు. ఆ సందర్భంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీని అనౌన్స్ చేయడం కానీ.. సెట్స్ పైకి తీసుకురావడం కానీ చేస్తారని.. అందుకే అలా చెప్పాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. మరో వైపు బన్నీ, లోకేష్ కనకరాజ్ కాంబో మూవీ కూడా సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ ఎవరితో అనేదే పెద్ద చర్చ అయ్యింది. ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ బిజీలో ఉంటే.. త్రివిక్రమ్ వెంకీతో ఆదర్శ కుటుంబం మూవీ బిజీలో ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసి.. ఆ తర్వాత మైథలాజికల్ మూవీని పట్టాలెక్కిస్తారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తుంది. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Read Also: ప్రభాస్ రాజాసాబ్ జోరు.. ఫస్ట్ డే 54 కోట్లు కలెక్షన్స్
Follow Us On : WhatsApp


