కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఎక్సైజ్ డీటీఎఫ్ టీంపై (Excise DTF Team) దొంగతనం ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. రెండు రోజుల క్రితం శంషాబాద్ (Shamsabad) మద్యం మిస్సింగ్ కేసులో ఎక్సైజ్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అదే సమయంలో నిందితుల ఇళ్లల్లో ఎక్సైజ్ డీటీఎఫ్ టీం సోదాలు చేపట్టారు. నిందితుల ఇళ్లల్లో కొన్ని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ తనిఖీల సమయంలో ఓ నిందితుడి ఇంట్లో 21 గ్రాముల బంగారం, కొంత నగదు కనిపించకుండా పోయినట్లు పేర్కొంటున్నారు. ఈ మొత్తాన్ని ఎక్సైజ్ డీటీఎఫ్ టీం సభ్యులే కాజేశారని ఆరోపిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాలు జరిపిన డీటీఎఫ్ ప్రవీణ్ టీంను అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
Read Also: ఇండస్ట్రీస్, ఇరిగేషన్ రంగాలకు ప్రయారిటీ
Follow Us On: Sharechat


