కామారెడ్డి(Kamareddy) రైతులు రోడ్డెక్కారు. తరుగు పేరుతో తమను మిల్లర్లు వేధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కామారెడ్డిలో రాస్తారోకో చేపట్టారు. మిల్లర్ల వేధింపులను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తారు. లేదంటే తమకు ఆత్మహత్యే గతి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొందరు రైతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. తరుగు పేరుతో ఒక్కో బస్తాకు ఆరు నుండి ఏడు కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తూకం వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుండి అధికంగా తూకం వసూలు చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనతో బాన్సువాడ–బోధన్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Read Also: అది HAM కాదు.. పెద్ద స్కాం: వేముల

