కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సొంత నియోజకవర్గం పిఠాపురంలో (Pitapuram) శుక్రవారం సంక్రాంతి వేడుకలు (Sankranti Celebrations) ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి మహోత్సవాల పేరిట నిర్వహిస్తున్న ఈ సంబరాలకు పవన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పవన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ వేడుకలకు భారీ ఎత్తున తరలివచ్చారు. మూడు రోజుల పాటు ఈ సంబరాలు ఎంతో ఘనంగా జరగనున్నాయి.
అయితే ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఏ చిన్న విషయం జరిగినా ఎంతో దారుణం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. పని చేసే నాయకులకు అండగా నిలవాలి. గత పాలకులు ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేయకుండా తమని ప్రశ్నిస్తున్నారని, అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఏదైనా చెడగొట్టడం, పడగొట్టడం ఎంతో తేలిక నిర్మించడమే కష్టమనీ పవన్ పేర్కొన్నారు.

Read Also: తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైల్స్ దగ్ధం
Follow Us On: X(Twitter)


