epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేవంత్ రెడ్డికి సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి వెళ్లే ద‌మ్ముందా? : హ‌రీష్ రావు

క‌లం వెబ్ డెస్క్‌ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాపింగ్ మాల్ ఓపెనింగ్‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి థియేట‌ర్ ఓపెనింగ్‌కు అశోక్ న‌గ‌ర్‌కు వెళ్తున్నాడ‌ని, ప‌క్క‌నే ఉన్న సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి (Central Library) వ‌చ్చే ద‌మ్ముందా అని స‌వాల్ విసిరారు. గ‌తంలో ఎన్నిక‌ల ముందు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ నిరుద్యోగుల‌తో ఇదే అశోక్‌న‌గ‌ర్‌లో సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి వ‌చ్చార‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ఒకే ఏడాదిలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని మాటిచ్చార‌ని తెలిపారు. దిల్‌సుఖ్ న‌గ‌ర్‌లో నిరుద్యోగులు గురువారం ఉద్యోగాల కోసం ధ‌ర్నాలు చేశార‌ని చెప్పారు. మ‌రోవైపు మంత్రి శ్రీధ‌ర్ బాబు అసెంబ్లీ సాక్షిగా అంద‌రికీ ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు ఇవ్వ‌లేమ‌ని చెప్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న పిల్ల‌ల‌ను పోలీసులు నోటికొచ్చిన బూతులు తిడుతూ, కొడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రేవంత్ రెడ్డి అశోక్ న‌గ‌ర్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి వెళ్లి నాడు యువ‌త‌కు ఏం మాట ఇచ్చాడో మ‌ళ్లీ చెప్పాల‌ని హ‌రీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండ‌ర్‌, నిరుద్యోగ భృతి, ఆడ‌పిల్ల‌లకు స్కూటీలు అని చెప్పిన హామీల‌పై మ‌రోసారి మాట్లాడాల‌ని డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల ముందు వెళ్లిన అశోక్‌న‌గ‌ర్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ మ‌ళ్లీ గుర్తుకు రావ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. ప్రియాంకా గాంధీని తీసుకొచ్చి స‌రూర్‌న‌గ‌ర్ స్టేడియంలో యూత్ పాల‌సీని డిక్లేర్ చేశార‌ని చెప్పారు. పిల్ల‌ల‌కు ప‌రీక్ష‌ల‌కు ఫీజులు ఉండ‌వ‌న్నార‌ని, ఇప్పుడు ముక్కు పిండి వ‌సూలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రికి ధైర్యం, చిత్త‌శుద్ధి ఉంటే, నిరుద్యోగ యువ‌త‌కు న్యాయం చేశామ‌న్న న‌మ్మ‌కం ఉంటే అశోక్ న‌గ‌ర్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి రావాల‌ని, లేదంటే నిరుద్యోగ యువ‌త‌ను మోసం చేసిన‌ట్టేన‌ని వ్యాఖ్యానించారు.

Read Also: సిద్దిపేట మాజీ కమిషనర్ కు తప్పిన ప్రమాదం

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>