కలం వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా(NTR District) కంచికర్ల తహసీల్దార్ కార్యాలయం(Tahsildar Office)లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కార్యాలయంలోని రికార్డ్స్ గదిలో ఉన్న ఫైళ్లు దగ్ధమయ్యాయి(Records Burnt). చుట్టుపక్కల నివసించే వాళ్లు మంటలను గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగిందా? లేక ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. మంటలు ఆర్పిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది కాలిపోయిన ఫైళ్లను బయటపడేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని నందిగామ ఆర్టీవో(RDO) బాలకృష్ణ తెలిపారు. గురువారం రాత్రి కొందరు ఆఫీస్ వద్ద చలిమంటలు వేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. కాగా, ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా అగ్నిప్రమాదాలు((Fire Accident)) చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.


