కలం, వెబ్ డెస్క్ : ఏపీలో మరో కొత్త రాజకీయం తెరమీదకు వస్తోంది. వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేల జీతాలపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చర్చలు జరిపింది. కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా వచ్చినట్టు రిజిస్టర్ లో సంతకాలు చేస్తున్నారంట. వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా అసెంబ్లీలో అడుగు పెట్టబోమన్నారు. కానీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు రిజిస్టర్ లో వైసీపీ ఎమ్మెల్యేల సంతకాలు ఉంటున్నాయని.. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతాలు, టీఏ, డీఏలు కూడా ఎలా తీసుకుంటున్నారంటూ నిన్న అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చర్చలు జరిపింది.
అసెంబ్లీకి రాకుండా ఇలా జీతాలు, అలవెన్సులు తీసుకోవడం చట్ట విరుద్ధమని.. వాళ్లకు నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా సలహాలు తీసుకున్న తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతానికి అర్హులు కాదని.. నిర్దేషించినన్ని సార్లు రాకపోతే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు తప్పేలా లేవు.
అసెంబ్లీకి రాకపోయినా జీతాలు తీసుకుంటున్నారని.. అర్హత లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని కూటమి వారిని టార్గెట్ చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. అటు వైసీపీ (YSRCP) కూడా బలమైన వాదనలు వినిపించేందుకు రెడీ అవుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఇన్ని సీట్లు కావాలనే రూల్ రాజ్యాంగంలో లేదని గతంలోనే చెప్పింది. దాన్నే మరోసారి వినిపించి.. అసెంబ్లీలో ప్రజల సమస్యలు వినిపించొద్దనే ఉద్దేశంతోనే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదనే విమర్శలు చేయాలని చూస్తోంది. ఈ లెక్కన ప్రధాన ప్రతిపక్ష హోదా మరోసారి తెరమీదకు వచ్చేలా కనిపిస్తోంది.
Read Also: మేడారంలో బంగారం కిలో రూ.60
Follow Us On: X(Twitter)


